Mauritius govt approves
special break on January 22 for celebrations
అయోధ్యలో బాలరాముడి మందిరంలో
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం (Ayodhya
Consecration Ceremony) సందర్భంగా మారిషస్
ప్రభుత్వం (Mauritius Government) తమ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక విరామం (Two Hours Special Break) ప్రకటించింది. ఆ రోజు మారిషస్లో స్థానికంగా నిర్వహించే
కార్యక్రమాల్లో హిందూ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ విరామం
ఇస్తున్నారు.
మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్
జగన్నాథ్ (Pravind Kumar Jugnauth) నేతృత్వంలోని క్యాబినెట్ ఆ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘జనవరి
22 సోమవారం నాడు రెండు గంటల ప్రత్యేక విరామం ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదించింది. అయోధ్యకు
రాముడు తిరిగి చేరుకోడానికి ప్రతీకగా భారతదేశంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
జరుగుతోంది. ఆ సందర్భంగా ఇక్కడి హిందువులు సంబరాలు జరుపుకోడానికి ఈ సెలవు ఉపయోగపడుతుంది’’
అని మారిషస్ ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది.
నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని 50కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం
చేస్తున్నారు. భారతీయ సంస్కృతి కలిగి ఉన్న ఆసియా దేశాలన్నీ తమతమ దేశాల్లో ప్రత్యేక
కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాయి.