Strikes On
Houthis
ఇజ్రాయెల్-హమాస్
మధ్య ఘర్షణలతో రగులుతున్న పశ్చిమాసియాలో మరో ఉద్రిక్త ఘటన రాజుకుంది. వాణిజ్య
నౌకలపై దాడులకు తెగబడుతున్న హౌతీలకేంద్రంపై అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడులకు దిగాయి.
యెమెన్
రాజధాని సనా, ఎర్రసముద్రంలోని హౌతీల స్థావరం హుదాయ్దా పై పైటర్ జెట్లు,
యుద్ధనౌకలు, జలాంతర్గాములతో దాడులు జరుపుతున్నారు.
యెమెన్
లోని 28 సాయుధముఠాల స్థావరాలతో పాటు మరో 70 పైగా లక్ష్యాలను అమెరికా, బ్రిటన్
సైన్యాలు ధ్వంసం చేశాయి. ఈ దాడులను నిరసిస్తూ హౌతీ మద్దతుదారులు సనాలో నిరసన
ర్యాలీలు చేపట్టారు.
ఎర్ర
సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లోని యెమెన్ తీర ప్రాంతాల వైపు రావొద్దని వాణిజ్య నౌకలను
సమాచారం అందజేసిన అమెరికా నావికాదళం, మరో 72 గంటల పాటు ఈ మార్గం గుండా
ప్రయాణించవద్దని హెచ్చరించింది.
మతిలేని చర్యలకు పాల్పడుతున్న హౌతీలు మరిన్ని భీకరదాడులు
ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెచ్చరించారు.
తమ
ప్రతిచర్యలకు నెదర్లాండ్స్, కెనడా, బెహ్రియిన్ మద్దతు తెలిపాయని, బ్రిటన్, అమెరికా
వెల్లడించాయి.
ఎర్ర
సముద్రంలో నౌకల భద్రత నిమిత్తం 22 దేశాలతో కలిసి ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్
పేరిట కొత్త సముద్ర రక్షణ మిషన్ ను అమెరికా ఏర్పాటు చేసింది.