పాలక
వైసీపీ తీరు, రాష్ట్ర పరిధిలోని రైల్వే, జాతీయ ప్రాజెక్టుల పాలిట శాపంగా మారిందని
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు.
వైసీపీ
ప్రభుత్వ తీరు కారణంగానే రాష్ట్ర పరిధిలోని రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 42
శాతం పెరిగిందని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని
ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యం, సహకార లోపంతో దాదాపు ౩౦
ప్రాజెక్టుల వ్యయం పెరిగి కేంద్రంపై దాదాపు 58 వేల కోట్ల రూపాయల మేర అదనపు భారం
పడిందన్నారు.
నడికుడి–శ్రీకాళహస్తి
రైల్వే లైన్ ప్రాజెక్టు వ్యయంలో సగం భరించాల్సి ఉందని కానీ రాష్ట్రం నిధులు విడుదల
చేయకపోవడంతో ప్రాజెక్టు వ్యయం అసాధారణంగా పెరిగిందన్నారు.
పిడుగురాళ్ల
నుంచి శావల్యాపురం మధ్య 46 కిలోమీటర్ల మేర పనులు జరిగాయన్నారు.
కోటిపల్లి–నర్సాపూర్
ప్రాజెక్టుకు రూ.2,120 కోట్లతో 57 కిలోమీటర్ల వ్యయంతో 2000-01లో ప్రాజెక్టు మంజూరు కాగా, 75 శాతం
నిధులు కేంద్రం అందజేస్తోండగా 25 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉందన్నారు. ఈ
నిధులు కూడా సకాలంలో విడుదల కావడంలేదన్నారు.
ముదరవలస
వద్ద రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని బదిలీ చేయకుండా
మీనమేషాలు లెక్కబడుతోందని ఎద్దేవా చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని
వాల్తేరు డివిజన్‌కు వివిధ అభివృద్ధి
కార్యక్రమాల కోసం 2023-24 ఏడాదికి గాను
రికార్డు స్థాయిలో రూ.2857.85 కోట్లు కేంద్రప్రభుత్వం కేటాయించిందని
తెలిపారు.
యూపీఏ
ప్రభుత్వ హయాంలో కంటే ఎన్డీయే పాలనలో ఆంధ్రప్రదేశ్ కు నిధుల కేటాయింపు జరిగిందన్న
దినకర్,
2019
– 24 మధ్య సగటున వార్షిక బడ్జెట్ కేటాయింపులు
సుమారు రూ.6,000 కోట్లకు పెరిగాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో
31 కొత్త రైల్వే ప్రాజెక్టుల పనులు
జరుగుతున్నాయన్నారు. 70,000 కోట్ల విలువైన 16 కొత్త లైన్లు మరియు 15 డబ్లింగ్
లైన్ల పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.
జాతీయరహదారుల
అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న దినకర్, ఆంధ్రప్రదేశ్ లో 2014కి
ముందు జాతీయ రహదారుల మొత్తం పొడవు 4193 కిలోమీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 8,683 కిలోమీటర్లకు
పెరిగిందన్నారు.
2022-23
సంవత్సరానికి 31,000 కోట్ల విలువైన 39 జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్రానికి
కేటాయించారని వివరించారు. భారతమాల ప్రాజెక్టులో భాగంగా రూ. 19 వేల కోట్లతో 342
కోట్ల రూపాయిల నిడివితో పులివెందుల నుంచి
మేదరమెట్లకు 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే పనులు జరుగుతున్నాయన్నారు.
సాగరమాల
ప్రాజెక్టు కింద కత్తిపూడి నుంచి ఒంగోలు రహదారిని నాలుగులైన్లకు అభివృద్ధి
చేస్తున్నామన్నారు.
రూ.30
వేల కోట్లతో రాజధాని అమరావతి నుంచి
అనంతపురం వరకు 600 కిలోమీటర్ల నిడివి కలిగిన రాయలసీమకు బెంగళూరు వరకు వేయవలసిన
రహదారికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కేవలం అమరావతి పై కక్షతో ప్రాజెక్టు రద్దు చేశారన్నారు. దీంతో
పశ్చిమ ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగుండపాలెం, కర్నూలు,అనంతపురం ప్రాంత ప్రజలు తీవ్రంగా
నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రప్రభుత్వ
పథకాలకు వైసీపీ ప్రభుత్వం తన స్టిక్కర్లు వేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో
పేదల నివాసం కోసం పీఎం ఆవాస యోజన పథకంలో భాగంగా 25 లక్షల గృహాలు కేంద్రం మంజూరు
చేస్తే దానికి జగనన్న కాలనీ పేరు పెట్టారని ఎద్దేవా చేశారు. పీఎం పోషణ నిధులను
జగనన్న గోరుముద్దగా మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
గరీబ్
కళ్యాణ్ అన్న యోజన ద్వారా 2.70 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని
కేంద్రం అందజేస్తోంటే రేషన్ షాపుల వద్ద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి రాజకీయాలు
చేస్తున్నారని మండిపడ్డారు.
చిన్న
చిన్న బిల్లులే హాస్పటల్స్ కు సకాలంలో చెల్లించకుండా ఆరోగ్య శ్రీ 25 లక్షలకు పెంచామనడం బూటకమని విమర్శించారు. “విశ్వ కర్మ యోజన” పథకాన్ని కూడా వైసీపీ తమ ఖాతాలో వేసుకునేందుకు
ప్రయత్నిస్తోందన్నారు.