BJP wins big in North Cachar Hills Autonomous Council in
Assam
అసోంలోని దిమా హసావ్ జిల్లాలో నార్త్ కచార్
హిల్స్ అటానమస్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
కౌన్సిల్లో మొత్తం 30మంది సభ్యులు ఉంటారు.
వారిలో ఇద్దరు నామినేటెడ్ సభ్యులు. మిగతా 28 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో
ఆరు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. అవన్నీ బీజేపీయే దక్కించుకుంది. మిగతా 22 స్థానాలకు జనవరి
8న పోలింగ్ జరిగింది. వాటిలో 19 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మిగిలిన 3 స్థానాల్లో
స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు.
జనవరి 8న జరిగిన పోలింగ్‌లో 86శాతం ఓటింగ్ జరిగింది.
ఈశాన్యభారతంలోని అసోం రాష్ట్రంలో కీలకమైన ఈ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం
కట్టబెట్టినందుకు దిమా హసావ్ జిల్లా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు
తెలిపారు.
ఈ ఎన్నికల్లో దేహాంగీ కౌన్సిల్ నియోజకవర్గం నుంచి
పోటీ చేసిన కౌన్సిల్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేబోలాల్ గార్లోసా, హాతీకానీ
నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మిలిటెంట్ నాయకుడు నిరంజన్ హోజాయ్ గెలిచారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా పార్టీ బాధ్యులను ఈ విజయం
సాధించినందుకు అభినందించారు.