ద్వాదశ
జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైలక్షేత్రంలో సంక్రాంతి వేడుకలు
కనులపండుగగా జరుగుతున్నాయి. భక్తుల రాకతో శ్రీగిరిపై సందడి వాతావరణం నెలకొంది. నిన్న యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ కార్యక్రమాలు
నిర్వహించారు, నేడు ఆదిదంపతులకు భృంగివాహన సేవ, ప్రాకారోత్సవం నిర్వహించనున్నారు.
కరవుకాటకాలు
నివారించబడి, వ్యవసాయదారులు సుభిక్షంగా ఉండాలని అర్చకులు శివ సంకల్పం పఠించారు. లోక కళ్యాణం కాంక్షిస్తూ మకర సంక్రమణ
పుణ్యకాలంలో ఏడురోజుల పాటు పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు ఘనంగా జరగాలని శ్రీభ్రమరాంబ
మల్లికార్జున స్వామిని ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు వేడుకున్నారు.
ధనుర్మాసం ఘడియలు ఈ నెల 14తో ముగియనుండటంతో, మరుసటి
రోజు నుంచి తిరుమలలో సుప్రభాత సేవ పున:ప్రారంభం
అవుతుందని టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 17 తెల్లవారుజామున 12.34 గంటలకు
ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవ్వగా అప్పటి నుంచి సుప్రభాత సేవ బదులుగా గోదా
తిరుప్పావై పారాయణం నిర్వహిస్తున్నారు. జనవరి 16న ఉదయం తిరుమలలో గోదాపరిణయోత్సవం
మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు
వెల్లడించారు.