Ayodhya administration sets world record with longest
solar light line installation
అయోధ్య నగరపాలకసంస్థ ప్రపంచ రికార్డు (Ayodhya
World Record) సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సోలార్
లైట్ లైన్ (సౌర విద్యుద్దీపాల వరుస) ఏర్పాటు చేసింది. (World’s longest
solar light line)
ఇప్పటికే నగరంలోని గుప్తార్ ఘాట్ నుంచి ఝుంకీ
ఘాట్ వరకూ సౌరవిద్యుద్దీపాలను అమర్చిన నగరపాలకసంస్థ, ఇప్పుడా వరుసను నయాఘాట్ వరకూ
పొడిగిస్తోంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా అయోధ్యలోని దాదాపు అన్ని
ఘాట్లనూ కలుపుతున్నారు. గతంలో అవన్నీ విడివిడిగా ఉండేవి. వాటిని కలుపుతూ సోలార్
లైట్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
కొత్తగా నిర్మిస్తున్న ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమంతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడ మౌలిక
సదుపాయాలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో శరవేగంతో కల్పిస్తోంది.
ప్రాణప్రతిష్ఠకు ముందు వస్తున్న మకర సంక్రాంతి
పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో మెగా స్వచ్ఛతా ప్రచార
కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దాంతోపాటే రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలూ,
నగరాల్లో కూడా స్వచ్ఛతా అభియాన్ నిర్వహిస్తారు.
శ్రీరామజన్మభూమి అయోధ్యలో
500 ఏళ్ళ తర్వాత నిర్మిస్తున్న కొత్త గుడిలో జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమం ఉత్తరప్రదేశ్ రూపురేఖలను మార్చివేస్తోంది.