115 foot high Ram banner
on a Gujarat building
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ (Ayodhya Consecration Ceremony) జరిగే జనవరి 22 కోసం దేశంలోని హిందూ ఆస్తికులందరూ ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. ఆ కార్యక్రమంలో తమవంతు పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
ఆ క్రమంలోనే, సూరత్‌లో (Surat) 115 అడుగుల రాముడి బ్యానర్ (115 ft high banner) వేలాడదీసారు.
500 ఏళ్ళ తర్వాత రాముడిని అయోధ్యలోని
మందిరానికి ఆహ్వానిస్తూ ఉత్సవం చేస్తున్నారు. చిన్నచిన్న అపశ్రుతులు వదిలేస్తే, దేశవ్యాప్తంగా
ఈ అద్భుత కార్యక్రమం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది అయితే తమకు
తోచిన కానుకలు, ఆభరణాలూ సమర్పిస్తున్నారు.
సూరత్‌కు చెందిన ప్రవీణ్ గుప్తా అనే
బ్యానర్ల తయారీదారుడు ఒక బ్యానర్ తయారు చేసారు. దాని ఎత్తు 115 అడుగులు. దానిమీద
రాముడి బొమ్మతోపాటు జైశ్రీరామ్ అన్న నినాదం కూడా రాసి ఉంది. దాన్ని ఒక బహుళ
అంతస్తుల భవనం పైనుంచి వేలాడదీసారు.
‘‘ఇలాంటి బ్యానర్లను చాలా ఇళ్ళు
వేలాడదీస్తున్నాయి. అయితే ఇంత పొడవైన బ్యానర్ సూరత్ నగరంలోనే లేదు. ప్రజలందరి
తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది. దీన్ని చూస్తుంటే శ్రీరామచంద్ర ప్రభువే వచ్చేసినట్టుంది’’
అని ప్రవీణ్ గుప్తా వ్యాఖ్యానించాడు.
సూరత్‌లో జనవరి 21న శోభాయాత్ర జరగనుంది. ఆనాటి
రాత్రి ప్రతీ ఇంటిలోనూ 11 దీపాలు వెలిగిస్తారు. సుందరకాండ పారాయణ చేస్తారు. మొత్తం
మీద సూరత్ అంతా రామనామజపంలో మునిగిపోనుంది.