దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ప్రధాని మోదీ ముంబైలో ప్రారంభించారు. దాదాపు రూ.21,200 కోట్ల వ్యయంతో ముంబైలోని సేవ్రీ నుంచి నవాశేవాను కలుపుతూ 21.8 కి.మీ మేర ఈ భారీ వంతెనను నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ గౌరవార్థం, ఈ వంతెనకు అటల్ సేతు (atal setu) అని నామకరణం చేశారు.
దేశ వాణిజ్య రాజధానిలో ఈ వంతెనను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.ఈ వంతెన అందుబాటులోకి రావడంతో నవీ ముంబై, పాత ముంబై మధ్య దూరం తగ్గనుంది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 2 గంటల సమయం పట్టేది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో కేవలం 20 నిమిషాల్లో ముంబై నుంచి నవీ ముంబై చేరుకోవచ్చు. భూకంపాలను తట్టుకునేలా ఈ వంతెనను తీర్చిదిద్దారు. దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. ప్రస్తుతానికి ఈ వంతెనపై కార్లను మాత్రమే అనుమతిస్తున్నారు.