45tonnes of laddus to
be distributed as ‘prasad’ on consecration day
అయోధ్యలో బాలరాముడి మందిరం ప్రాణప్రతిష్ఠ
జరిగే జనవరి 22 కోసం దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఆ రోజు కార్యక్రమానికి దేశ
విదేశాల నుంచి వేల సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. ఆ రోజు రాముడి ప్రసాదంగా
పంచడానికి లడ్డూల తయారీ మొదలైపోయింది. వారణాసి నుంచి, గుజరాత్ నుంచి ప్రత్యేకంగా
రప్పించిన వంటవాళ్ళ బృందం ఆ పనిలో నిమగ్నమైంది.
ప్రాణప్రతిష్ఠ రోజు ప్రసాదంగా శుద్ధమైన
దేశీ నెయ్యితో తయారైన లడ్డూలను పంచిపెట్టాలని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
నిర్ణయించింది. ఆ ఒక్కరోజుకూ 45 టన్నుల లడ్డూలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఆ
మేరకు మిఠాయిలు తయారుచేయాలని కోరారు.
నిపుణులైన వంటవాళ్ళ బృందం రంగంలోకి దిగింది.
జనవరి 6 నుంచీ లడ్డూలు తయారుచేసే పని మొదలుపెట్టారు. రోజుకు సుమారు 1200 కేజీల
లడ్డూలు తయారవుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నాటికి మొత్తం ప్రసాదం తయారీ
పూర్తవుతుంది. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రసాదాన్ని
స్వామివారికి సమర్పించి, ఆ తర్వాత దాన్ని భక్తులకు పంచుతారు.
ప్రాణప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమానికి
వారం ముందునుంచీ, అంటే జనవరి 16 నుంచీ వైదిక సంప్రదాయిక కార్యక్రమాలు మొదలవుతాయి.