National Youth Festival
భారతదేశ
సమగ్రాభివృద్ధిలో యువశక్తి పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాసిక్
పర్యటనలో భాగంగా జాతీయ యువజనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, యువతకు
శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు యువత ప్రాధాన్యం ఇవ్వాలని
కోరిన మోదీ, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
స్వతంత్ర ఆలోచనలతో యువతరం
ముందుకు సాగితే దేశ లక్ష్యాలు నెరవేరతాయని ఆధ్యాత్మిక గురువు శ్రీఅరబిందో నమ్మేవారిని
గుర్తు చేసిన మోదీ, ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
దేశ
భవిష్యత్ యువత అంకితభావంపై ఆధారపడి ఉంటుందని స్వామివివేకానంద చెప్పిన విషయాన్ని
ప్రస్తావించారు.
యువతకు
చరిత్ర సృష్టించే సత్తా ఉందని కీర్తించారు. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా
పనిచేయాలని నిర్దేశం చేశారు.
నైపుణ్యంతో
కూడిన యువశ్రామిక శక్తి కల్గిన దేశంగా భారత్ ను ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు.
యోగా, ఆయుర్వేద బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతుండటం మంచి పరిణామం అన్నారు.
అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు
చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం
అవ్వాలని పునరుద్ఘాటించారు.