అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఇవాళ దేశీయ స్టాక్ సూచీలు (bse nse stock markets) సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఐటీ రంగంలో భారీ ర్యాలీ కొనసాగింది. సెన్స్ 847 పాయింట్లు పెరిగి, 72568 వద్ద ముగిసింది. నిఫ్టీ ఏకంగా 247 పాయింట్లు పెరిగి 21894 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.92 వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధర స్వల్పంగా తగ్గి బ్యారెల్ 79.53 వద్ద కొనసాగుతోంది. ఔన్సు బంగారం 2043 డాలర్లకు ఎగబాకింది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించాయి.ఐటీ రంగం ఆశించినమేర త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో ర్యాలీ కొనసాగింది. త్రైమాసికంలో టీసీఎస్ 8.2 శాతం వృద్ది నమోదు చేసింది. ఇవాళ ఒక్క రోజే ఇన్ఫీ స్టాక్ 7 శాతం పెరిగింది. టీసీఎస్ 4 శాతంపైగా లాభాలార్జించింది.