ED raid underway at the
premises of West Bengal minister, TMC leader Sujit Bose
పశ్చిమ బెంగాల్ లోని టీఎంసీ నేతల అక్రమాలు
ఒక్కోక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. పురపాలక, పాఠశాల విద్య శాఖల్లో ఉద్యోగనియామకాల్లో
జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలు
విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మంత్రి , టీఎంసీ నేత
సుజిత్ బోస్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
మున్సిపాలిటీ
ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు
తెలిపారు. పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించి తనిఖీలు చేస్తున్నారు.
కలకత్తాకు
చెందిన బిల్డర్ అయాన్ షీల్ ను స్కూల్ జాబ్స్ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్న
సందర్భంలో మున్సిపల్ శాఖ నియామకాల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
మున్సిపల్
ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షల ఓఎంఆర్ జవాబు పత్రాలు ఆయాన్ కు చెందిన సాల్ట్
లేక్ ఆఫీసులో దొరికాయి.
మున్సిపల్
శాఖ నియామకాల్లో అక్రమాలకు సంబంధించి గతంలోని బోస్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. 2014-16
కాలంలో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదు అయ్యాయి.
ఉద్యోగాలు
అమ్ముకున్న కేసులో ఇప్పటికే మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు అయ్యారు.
పురపాలక
శాఖ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు స్కూల్ జాబ్స్
నియామకాల్లో అక్రమాలు మధ్య సంబంధముందని కోర్టుకు సీబీఐ, ఈడీ తెలిపాయి.
2010 నుంచి 2021 వరకు దక్షిణ డుమ్ డుమ్ మున్సిపాలిటీ
ఉపాధ్యాక్షుడిగా వ్యవహరించిన బోస్, 250 మందికి ఉద్యోగాలిచ్చారు. ఈకేసులో భాగంగా
విచారణ సంస్థల నోటీసు అందుకున్న మొదటి మంత్రి బోసు.