Panchayat-level
weather forecast from next week
భారత
వాతావరణ విభాగం (IMD) కీలక ప్రకటన చేసింది. గ్రామీణప్రాంతాలకు
IMD సేవలను విస్తరించే క్రమంలో భాగంగా 12
భారతీయ భాషల్లో పంచాయతీల స్థాయిలో వాతావరణ సమాచారాన్ని వెల్లడించనుంది. ఈ
విషయాన్ని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర(Imd chief mohapatra ) తెలిపారు.
పంచాయతీ
వాతావరణ సేవ ద్వారా సమాచారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. తుపానులు, గాలుల వేగంతో పాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తెలుసుకునే
వీలుందని వివరించారు. ప్రతీ గ్రామంలో కనీసం ఐదుగురు రైతులకు వాతావరణ సేవలు అందాలనేది
తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రతీ
చోటా వాతావరణం, ఇంటింటికి వాతావరణం పేరిట అందించే
సేవల్లో భాగంగా దేశంలో ఎక్కడి నుంచైనా వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు
అని సూచించారు. ప్రాంతం పేరు, పిన్
కోడ్ లేదా అక్షాంశ రేఖాంశాలను తెలపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు అన్నారు.
క్రీడా, పారిశ్రామిక రంగాలు వాతావరణ
సమాచారాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం లేదని అభిప్రాయపడిన మహాపాత్ర, నిర్మాణ పనులు, శుభకార్యాల సమయంలో కూడా యాప్ ద్వారా
సమాచారం పొందవచ్చు అని సూచించారు.
ఐఎండీ
150వ వార్షికోత్సవ ఉత్సవాల సందర్భంగా ఏడాది పొడవునా రోజువారీ కార్యక్రమాలు
కొనసాగుతాయన్నారు. పిడుగుపాటు అలర్ట్ కు సంబంధించి ఇప్పుడు 1,200 నగరాలు, పట్టణాల్లో సేవలు అందిస్తామన్నారు.
ఇప్పటి
వరకు 3 కోట్ల మందికి వాతావరణ శాఖ చేరువైందని, భవిష్యత్
లో 10 కోట్ల మందికి సేవలందించాలన్నదే తమ లక్ష్య మన్నారు.