Afghanistan in
bharat, 3 T20I Series, 2024
1st T20I-Bharat
beat Afghanistan by 6 wickets
ఆప్ఘనిస్తాన్‌తో
జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల
సిరీస్‌లో భాగంగా మోహాలీ వేదికగా జరిగిన పోరులో ఆప్ఘాన్ జట్టు నిర్దేశించిన 159
పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 17.3 ఓవర్లలోనే చేధించింది. నాలుగు వికెట్లు
కోల్పోయి విజయం సాధించి సీరీస్ లో 1-0తో ముందంజలో ఉంది.
టాస్
ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158
పరుగులు చేసింది.
ఆప్ఘనిస్తాన్‌కు
ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్(25), గుర్బాజ్(23) రాణించారు. తొలి వికెట్‌కు 50 పరుగులు
సాధించారు. మహ్మద్ నబీ 27
బంతుల్లోనే 42 పరుగుల చేశాడు.
అజ్మతుల్లా ఒమర్జాయ్(29) రాణించడంతో ఆప్ఘనిస్తాన్ 158 పరుగులు చేయగల్గింది.
భారత
బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీయగా, శివమ్ దూబే ఒక
వికెట్ తీశాడు.
159
పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి
ఓవర్ రెండో బంతికే రోహిత్ శర్మ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
శుభమన్
గిల్(23), తిలిక్ వర్మ(26), జితేశ్ శర్మ(31) రాణించారు. రింకూసింగ్ 9 బంతుల్లో 16
పరుగులతో అజేయంగా నిలవగా, దూబే 40 బంతులు ఆడి 60 పరుగులు చేయడంతో 17.4 ఓవర్లకే
భారత్ విజయ లక్ష్యాన్ని అందుకుంది.
ఆప్ఘానిస్తాన్
బౌలర్లలో ముజీవ్ ఉర్ రెహ్మాన్ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆదివారం
ఇండోర్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.