Ramayana
Spiritual Forest
శ్రీరాముడి
అరణ్యవాస ఘట్టం ఇతివృత్తంతో సరయూనది ఒడ్డున ఆధ్యాత్మిక వనం ఏర్పడబోతోంది. అయోధ్య
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శ్రీరాముడి 14 ఏళ్ళ వనవాసానికి సంబంధించిన విశేషాలతో
పర్యావరణహిత అటవీ నిర్మాణం జరగనుంది.
రామాయణం,
శ్రీరాముడు, అయోధ్యతో పాటు సరయూ నదికి కూడా హిందూమతంతో విడదీయరాని బంధం ఉంది. అందుకే
సరయూ నది ఒడ్డునే ఈ ప్రతిపాదిత ఆధ్యాత్మిక వనాన్ని ఏర్పాటు చేస్తోన్నట్లు అయోధ్య
మాస్టర్ ప్లాన్ ఆర్కిటెక్చర్ దిక్షు కుక్రేజా తెలిపారు.
అయోధ్య
రామమందిర మొదటి దశ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట
జరగనుంది.
రెండో
దశ పనుల్లో భాగంగా ఈ పర్యావరణ అనుకూల అటవీ పెంపకం జరగనుంది. భక్తులతో పాటు
పర్యావరణ ప్రేమికులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ఆద్మాత్మిక వనం ఉండబోతుందని
కుక్రేజా తెలిపారు.
వారణాసిలోని
కాశీవిశ్వనాథ్ కారిడార్ తరహాలో భ్రమణ పథ్ ప్రాజెక్టును కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.
సరియు, శ్రీరామ మందిరాన్ని కలిపేలా ఈ రహదారి నిర్మాణం జరగనుంది. రామ్ పథ్, భక్తి
పథ్, శ్రీరామ జన్మభూమి పథ్, తర్వాత నాల్గో ప్రాజెక్టుగా భ్రమణ్ పథ్‌ను
చేపట్టనున్నారు.