Yajurveda Recital commences in Ram Temple Complex
అయోధ్యలో నిర్మిస్తున్న నూతన రామమందిరం (Ayodhya
Ram Temple) సముదాయంలో నేటినుంచీ యజుర్వేద పారాయణ కార్యక్రమం (Yajurveda
Recital) నేటినుంచీ ప్రారంభమైంది. యజుర్వేద పారాయణ మరో నాలుగు రోజుల పాటు
కొనసాగుతుంది.
యజుర్వేద పారాయణ నిమిత్తం ఆలయ సముదాయ ప్రాంగణంలో
రెండు వేదికలు నిర్మించారు. వేదపారాయణ కోసం 101 మంది వేదపాఠిలను ఆహ్వానించారు. యజుర్వేద
పారాయణం వల్ల ప్రతికూల శక్తులు నశించిపోతాయి. అందుకే ఏ వైదిక కార్యక్రమం
ప్రారంభంలోనైనా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం భారతీయుల ఆచారం.
మరోవైపు, అయోధ్య-అహ్మదాబాద్ మధ్య వారానికి మూడు
సార్లు నడిచేలా విమాన సేవలను ఇండిగో సంస్థ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ రాజధాని
లక్నోలో ఇవాళ ఆ మేరకు మొదటి బోర్డింగ్ పాస్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్‌కు ఇండిగో యాజమాన్యం అందజేసింది. అయోధ్యకు విమాన సేవలు నేటి నుంచీ ప్రారంభమైనట్లు
ఇండిగో ప్రతినిధులు ప్రకటించారు.