100 chartered planes to Ayodhya on 22 January
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో
(Ayodhya Ram Temple) బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం (Consecration
Ceremony) రోజు నగరానికి సుమారు వంద ఛార్టర్డ్ ప్లేన్స్ (100 Chartered
Planes) వస్తాయి. ఆ అద్వితీయ కార్యక్రమానికి వస్తున్న అతిథులను ప్రత్యేక
విమానాలు తీసుకొస్తాయి.
వంద ఛార్టెర్డ్ విమానాలు రావడం కొత్త విమానాశ్రయం
సామర్థ్యాన్ని పరిశీలించేందుకు కూడా సాయపడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి
ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) చెప్పారు. రాష్ట్రానికి నాలుగో
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయోధ్యలో కేటాయించినందుకు యోగి ప్రధాని నరేంద్రమోదీకి
ధన్యవాదాలు తెలిపారు.
అయోధ్యలో కొత్త విమానాశ్రయం డిసెంబర్ 30న ప్రారంభమైంది.
దానికి రామాయణకర్త వాల్మీకి పేరు మీద మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం
(Maharshi Valmiki International Airport) అని నామకరణం చేసారు. మొదటి దశలో యేడాదికి కనీసం
10లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉండేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.