ప్రముఖ నటి నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన అన్నపూరణి చిత్రంలో (annapoorani cinema) శ్రీరాముడిని అగౌరవ పరిచారని, ఈ సినిమా ద్వారా లవ్ జిహాద్‌ని ప్రచారం చేశారంటూ హిందూ సేవా పరిషత్ చేసిన పిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి నయనతార, చిత్ర దర్శక, నిర్మాతలతోపాటు, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.
చిత్రంలో నటించిన నయనతార, దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్.రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. హిందూ సేవా పరిషత్ జబల్పూర్లోని ఒంటి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబరు 1న థియేటర్లలో విడుదలైన చిత్రం, డిసెంబరు 29న ఓటీటీలో కూడా విడుదల చేశారు. ముంబైలో వీహెచ్‌పీ ఇచ్చిన పిర్యాదు మేరకు ఓటీటీ నుంచి అన్నపూరణి చిత్రం తొలగించినట్లు జీ మూవీస్ ప్రకటించింది.