Atal Setu ready to open
దేశంలోనే
అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన ప్రారంభోత్సవం రేపు జరగనుంది. ప్రధాని మోదీ, ఈ వంతెనను ప్రారంభించి జాతికి
అంకితం ఇవ్వనున్నారు.
ముంబై-నవీముంబైని
కలిపేలా నిర్మించిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌ను రూ. 20 వేల కోట్లు వెచ్చించి
నిర్మించారు. ఈ 22 కిలోమీటర్లు బ్రిడ్జికి అటల్ సేతు గా పేరుపెట్టారు.
మాజీ ప్రధాని అటల్ బిహార్ గౌరవార్థం ఈ
పేరుపెట్టారు. అయితే ఈ వంతెనపై ఆటోలు, బైకులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు.
వాహనాలు
100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ వంతెనను అధునాతన హంగులతో నిర్మించారు. ఈ
బ్రిడ్జి నిర్మాణంతో ముంబై నుంచి నవీ ముంబైకి ప్రయాణ దూరం తగ్గడంతో పాటు ముంబై
రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించబోతుంది.
బ్రిడ్జి
దాటేందుకు ప్రయాణ సమయం 20 నిమిషాలు పడుతుంది. దక్షిణ ముంబైలోని శివడి నుంచి
ప్రారంభమై ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్ వరకు వెళుతుంది. ముంబై-పుణె
ఎక్స్‌ప్రెస్ వే, ముంబై –గోవా హేవేలు కలిపేలా బ్రిడ్జిని నిర్మించారు. వంతెన పొడవు
22కిలోమీటర్లు కాగా సముద్రంపై 16.5 కిలోమీటర్లు, భూభాగంపై ఐదున్నర కిలోమీటర్లు మేర
నిర్మించారు.
పర్యావరణానికి
హాని కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఫ్లెమింగో పక్షులు వలస వచ్చినప్పుడు వాటికి
హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సౌండ్, వ్యూవ్ బేరియర్లు ఏర్పాటు చేశారు.
ఈ
బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి
ప్యాకేజీ పనుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. నిర్మాణ పనుల్లో 5 వేల మంది
శ్రామికులు శ్రమించారు. సముద్ర మట్టానికి 15 మీటర్ల ఎత్తులో వంతెనను నిర్మించారు.
వంతెన జీవితకాలం 100 ఏళ్లు కాగా, రోజుకు 70 వేల వాహనాలు రాకపోకలు సాగించనున్నాయి.