విమానాల్లో ప్రయాణీకుల చేష్టలు అందోళన కలిగిస్తున్నాయి. తోటి (crime news)ప్రయాణీకులపై మూత్రం పోసిన ఘటనలు అనేక మనం వింటూనే విన్నాం. తాజాగా ఓ ప్రయాణీకుడు వింతగా ప్రవర్తించాడు. కెనడాలోని టొరంటో నుంచి దుబాయ్ బయలుదేరడానికి సిద్దమైన విమానంలోని ఓ ప్రయాణీకుడు, తలుపు తెరచి గబాల్న దూకేశాడు. విమాన సిబ్బంది అడ్డుకునేలోపే అతను దూకేశాడు. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
20 అడుగల ఎత్తు నుంచి దూకడంతో ఆ ప్రయాణీకుడు గాయపడినట్లు ఎయిర్ కెనడా అధికారులు ప్రకటించారు. ప్రయాణీకుడి వింత చేష్టలతో తోటి ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. విమానంలో నుంచి దూకిన వ్యక్తి పదహారేళ్ల బాలుడిగా గుర్తించారు. అతడు ఎందుకు అలా చేశాడనే విషయం వెలుగులోకి రావాల్సి ఉంది. విమానం నుంచి దూకిన యువకుడు గాయాలపాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.