Srisailam temple income
శ్రీశైలం
శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకుల విలువ
రూ.4.38 కోట్లు అని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 13 నుంచి జనవరి
9 వరకు భక్తులు హుండీలో వేసిన నగదును అధికారులు లెక్కించారు.
రూ.4,38, 53, 238
కోట్ల నగదుతో పాటు, 133 గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండిని భక్తులు
మొక్కుల రూపంలో సమర్పించారని అధికారులు వెల్లడించారు.
శ్రీకాళహస్తీశ్వర
స్వామివారికి 28 రోజులకు గాను హుండీ కానుకల ద్వారా రూ. 1,55, 21,259 ఆదాయం
లభించింది. ప్రధాన హుండీతో పాటు పరివారం దేవతల వద్ద ఉన్న హుండీల కానుకల ద్వారా రూ.
1,55, 231259 నగదు, 43 గ్రాముల బంగారం, 415.440 కిలోల వెండి ని భక్తులు
సమర్పించారు. శ్రీగురు దక్షిణామూర్తి
సన్నిధి వద్ద హుండీ కానుకలను లెక్కించారు.
తిరుమల శ్రీవారిని బుధవారం 65,901 మంది భక్తులు
దర్శించుకున్నారు. రూ.3.77 కోట్ల హుండీ కానుకుల లభించాయి.