అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరాచకం వెలుగులోకి వచ్చింది.పోలీసుల కథనం ప్రకారం. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామంలోని బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఆ బాలిక తన బంధువులకు విషయం చెప్పింది. అది ఆటో డ్రైవర్‌కు తెలియడంతో, మరో స్నేహితుడితో కలసి బాలికను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
గూడెంకొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిపోయారని గమనించి, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై రమేష్ అనే ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. విషయం బయటకు రావడంతో మరో ఆటోడ్రైవర్‌తో కలసి బాలికను చంపేయాలని నిర్ణయించుకుని మరోసారి బాధితురాలి ఇంటికి వచ్చారు.బాలికను బెదిరించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఎలాగూ చంపేయబోతున్నాం కదా అని మరోసారి ఇద్దరూ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరవాత వారు ఆ బాలికను చీరతో ఊపిరాడకుండా చేసి చంపేశారు.
అంతక్రియల సమయంలో బాధితురాలి శరీరంలోపై గాయాలు కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.