ఎన్నికల
ప్రక్రియలో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి(CEC) రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు.
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాజీవ్ కుమార్, ఈ ఏడాదిలో జరిగే
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణం లో పారదర్శకంగా
నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని అన్ని పార్టీలు
కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లో 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించిన రాజీవ్ కుమార్, ఇంటి వద్ద నుంచి
ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారి
సంఖ్య 7.88 లక్షలు కాగా, వందేళ్ళు దాటిన వృద్ధ ఓటర్లు 1,174 మంది ఉన్నట్లు తెలిపారు.
మహిళా ఓటర్లు 2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల
22న తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు.