Congress declines to attend Ram Mandir Pran Pratishtha Program
ఊహించినదే జరిగింది. రాముడి పట్ల తమ వ్యతిరేకతను
నిరూపించుకుంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరు కారాదని కాంగ్రెస్
నిర్ణయించుకుంది. ఆ కార్యక్రమం ఆరెస్సెస్, బీజేపీ కార్యక్రమంలా ఉందంటూ సాకులు
చెప్పింది. (Congress denies invitation to Ayodhya Ram Mandir
Consecration Ceremony)
అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గత నెల కాంగ్రెస్
సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge),
సోనియా గాంధీ (Sonia Gandhi), అధీర్ రంజన్ చౌధురిలను (Adhir Ranjan
Chowdhury) ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఆ
ఆహ్వానానికి స్పందించడానికి కాంగ్రెస్ ఇంతకాలం తీసుకుంది. తాము రాబోము అని ఎలా చెప్పాలా
అని ఆలోచించుకున్న కాంగ్రెస్ నాయకులు, చివరికి ఆ నెపాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ల
మీదకు నెట్టేసారు.
అసలు కాంగ్రెస్ మొదటినుంచీ రాముడికి వ్యతిరేకంగానే
వ్యవహరిస్తూ వస్తోంది. (Congress is anti-Ram) రాముడి
ఉనికిని గుర్తించడానికి కూడా ఇష్టపడని పార్టీ అది. రామసేతును కూలగొట్టాలని
ప్రయత్నించిన పార్టీ అది. ఆ సమయంలో కోర్టులో కేసు దాఖలైనప్పుడు రాముడనే వ్యక్తి
లేడని వాదించిన పార్టీ అది. రాముడేమైనా ఇంజనీరా, సేతువు కట్టడానికి అంటూ అపహాస్యం
చేసిన డీఎంకేతో చేతులు కలిపిన పార్టీ అది. హిందువుల మనోభావాలంటే ఏమాత్రం పట్టింపు
లేని పార్టీ అది. క్రైస్తవులనూ, ముస్లిములనూ బుజ్జగిస్తే చాలు భారతదేశాన్ని
ఎన్నేళ్ళయినా పరిపాలించవచ్చని ఆలోచించే పార్టీ అది. అలాంటి పార్టీని రామమందిర ప్రాణప్రతిష్ఠకు
ఆహ్వానించడమే తప్పు. అయితే సభామర్యాద పాటించి అన్ని రాజకీయపార్టీలనూ
ఆహ్వానించినట్లే కాంగ్రెస్ నేతలను కూడా ఆహ్వానించారు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర
ట్రస్ట్ బాధ్యులు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి, తమ నైజాన్ని మరోసారి బైటపెట్టుకుంది
కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి జైరాం రమేష్ (Jairam
Ramesh Statement) ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసారు. అందులో తమ పార్టీ
నేతలు రామమందిర ప్రాణప్రతిష్ఠకు హాజరవడం లేదని వెల్లడించారు. ‘‘గత నెల కాంగ్రెస్
జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్
సోనియాగాంధీ, లోక్‌సభలో పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌధురిలకు – జనవరి 22న జరిగే రామమందిర
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది. మన దేశంలో కోట్లాది
ప్రజలు రాముణ్ణి పూజిస్తారు. మతం వ్యక్తిగత అంశం. కానీ అయోధ్యలో ఆలయం అంశాన్ని
ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏనాడో రాజకీయ అంశంగా మార్చేసాయి. నిర్మాణమే పూర్తికాని ఆలయాన్ని
ఆవిష్కరించడం వెనుక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఉద్దేశముంది. 2019లో
సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటూనే, రాముణ్ణి పూజించే కోట్లాది
భారతీయుల మనోభావాలను గౌరవిస్తూనే, ఆర్ఎస్ఎస్, బీజేపీ నిర్వహిస్తున్న ఈ రాజకీయ
కార్యక్రమానికి ఇచ్చిన ఆహ్వానాన్ని మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధీర్ రంజన్
చౌధురి గౌరవప్రదంగా తిరస్కరించారు’’ అని జైరాం రమేష్ ప్రకటించారు.
రామాలయ ప్రాణప్రతిష్ఠకు హాజరు కాబోమని తృణమూల్
కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. సమాజ్‌వాదీ పార్టీ ఇంకా
సందిగ్ధంలోనే ఉంది. ఆ పార్టీ నాయకత్వం ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానాన్ని తిరస్కరించింది.
కానీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళాలని భావిస్తున్నారు. ఎన్సీపీ నేత శరద్‌పవార్,
అయోధ్యకు వెళ్ళాలని విధి రాసిపెట్టి ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఆహ్వానం అక్కరలేదని
వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి)కి ఆహ్వానం
ఇప్పటివరకూ అందలేదు.