Anticipatory bail for NCBN in three cases
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు
(N Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఉన్నత
న్యాయస్థానం ఆయనకు ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ (Anticipatory
Bail) మంజూరు చేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు
ఉత్తర్వులు జారీ చేసారు. అదే సమయంలో, దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దంటూ
చంద్రబాబును ఆదేశించారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక,
మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు (Three
Cases) నమోదు చేసింది. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత
న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ
పిటిషన్లపై వాదనలు ఇప్పటికే ముగిసాయి. ఆ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు (AP
High Court) నేడు నిర్ణయాన్ని ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రికి ముందస్తు బెయిల్
మంజూరు చేసింది.
అదే సమయంలో, మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ
మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేశ్లకు కూడా
ముందస్తు బెయిల్ మంజూరైంది.