అయోధ్యలో
ప్రతియేటా ప్రాణప్రతిష్ట ఉత్సవం నిర్వహించనున్నట్లు యూపీ సీఎం యోగీ తెలిపారు. పదేళ్ళ
కిందట జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతుందన్న యోగీ, జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవం
వెలుగుల పండుగలా ఉంటుందన్నారు.
ఆయోధ్యలో
పూర్తి శాకాహార సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామన్నారు. హోటళ్ళ ఏర్పాటుకు 25కు పైగా
ప్రతిపాదనలు వచ్చాయన్నారు.
గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు
చేస్తామని చెప్పారు.
గత
ఏడాది శ్రీరామ నవమికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా ఆ సంఖ్య 35 లక్షలు దాటిందన్నారు.
అయోధ్య
విమానాశ్రయానికి 150 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది తో భద్రత కల్పించనున్నారు. కేంద్ర
భద్రత, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సీఎస్ఐఎఫ్ కు సెక్యూరిటికీ సిఫార్సు చేయగా కేంద్రం
ఆమోదం తెలిపింది.
తిరుపతి, అమృత్ సర్, వాటికన్ సిటీ, కాంబోడియా, జెరూసలెం
వంటి ప్రముఖ ప్రార్థనా స్థలాల అధ్యయనం చేసి అయోధ్య అభివృద్ధికి ప్రణాళికలు
రచించారు. మరో మూడు నాలుగేళ్ళలో పర్యాటక ప్రాంతంగా మారే అయోధ్యను నిత్యం మూడు లక్షల మంది భక్తులు సందర్శించే అవకాశం
ఉందని అంచనా. ఆర్కిటెక్ట్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో అయోధ్య లో మౌలిక వసతుల కల్పన
జరగనుంది. ఇందుకోసం రూ. 85 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మౌలిక వసతుల పనులు
పూర్తి అయ్యేందుకు సుమారు పదేళ్ళ సమయం పట్టే అవకాశముంది.