Ghaziabad to be renamed
గాజియాబాద్
పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదించింది. హర్నంది నగర్, గజప్రస్థ,
దూధేశ్వరనాథ్ నగర్ అనే మూడు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ గాజియాబాద్
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీతా దయాల్ వెల్లడించారు.
మూడింటి నుంచి ఏ పేరు ఎంపిక
చేయాలనే విషయంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ప్రాంతానికి
ఉన్న పూర్వ చరిత్ర తో పాటు హిందూ సంఘాల డిమాండ్ మేరకు ప్రతిపాదనను ఆమోదించినట్లు
తెలిపారు.
ఈ
విషయంపై స్పందించిన సాహిబాబాడ్ ఎమ్మెల్యే సునీల్ శర్మ, గాజియాబాద్ పేరును గజ్
ప్రస్థగా మార్చాలని గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.
మొఘల్
చక్రవర్తి అక్బర్ సన్నిహితుడు ఘజియుద్దీన్ పేరును గాజియాబాద్ గా మార్చారని
స్థానికులు చెబుతున్నారు.
పూర్వ
ఇక్కడ ఏనుగులు ఎక్కువగా నివసించేవని అందువల్ల ఈ
ప్రాంతాన్ని గజ్ ప్రస్థగా పిలిచేవారనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.
నగరాల
పేరు మార్పు విషయంలో కేంద్రానిదే అంతిమ నిర్ణయం.