దేశీయ
పర్యాటకరంగం అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. ప్రధాని మోదీ
లక్షద్వీప్ పర్యటన తర్వాత దేశీయ పర్యాటకుల చూపు లక్షద్వీప్ పై పడింది. దీంతో ఆయా
దీవుల సముదాయంలో మౌలికవసతుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోంది. మాస్టర్
ప్లాన్ లో భాగంగా అక్కడ అధునాతన విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం
యోచిస్తోంది.
యుద్ధ, పౌర అవసరాలు తీర్చేలా విమానాశ్రయాన్ని నిర్మించాలనే
ప్రతిపాదనను అధికారవర్గాలు పరిశీలిస్తున్నాయి.
మినికాయ్
వద్ద విమానాశ్రయ నిర్మాణంతో ఆరేబియా సముద్రంపై నిఘా పెంచడంతో పాటు వాయుసేన అవసరాలు
తీర్చేందుకు ఉపయోగపడనుంది.
ప్రస్తుతం
లక్షద్వీప్ మొత్తంలో అగట్టిలో ఒకే ఒక్క విమానాశ్రయం ఉంది. అక్కడ చిన్న విమానాలు
మాత్రమే దిగగల్గుతాయి.
దేశీయ
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే కేంద్ర నిర్ణయానికి పలువురు పారిశ్రామికవేత్తలు
మద్దతు తెలుపుతున్నారు. లక్షద్వీప్ లో
పెట్టుబడులు పెట్టేందుకు టాటా, ప్రవేగ్ సంస్థలు ముందుకొచ్చాయి.
సుహేలీ,
కద్మత్ దీవుల్లో తాజ్ బ్రాండెడ్ రిసార్టులు నిర్మించనున్నట్లు టాటా గ్రూప్
ప్రకటించింది. ఇండియన్ హోటల్స్ కంపెనీ ఈ
విషయాన్ని వెల్లడించింది. 2026 నాటికి వీటిని అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
సుహేలీలో
నిర్మించనున్న తాజ్ రిసార్టులో 60 బీచ్ విల్లాలు, 50 వాటర్ విల్లాలు సహా 110
గదులతో రిసార్టు నిర్మాణం జరగనుంది.
కద్మత్
ద్వీపంలో నిర్మించే రిసార్టులో 75 బీచ్ విల్లాలతో పాటు 35 వాటర్ విల్లాలు
నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని
మోదీ పర్యటించి సముద్రంలో నిర్వహించే సాహస విన్యాసాల్లో పాల్గొన్నారు. సముద్రపు
ఒడ్డున సేద తీరుతున్న ఫొటోలతో పాటు స సార్కెలింగ్ విన్యాసాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దీనిపై
మాల్దీవుల మంత్రలు అనుచిత వ్యాఖ్యల చేశారు. తమ పర్యాటక రంగంతో భారత్ పోటీ పడలేదంటూ
మాటజారారు. భారత్ లో పరిశుభ్రత ఉండదంటూ ఎద్దేవా చేయడంతో పాటు మోదీపై కూడా వివాదాస్పద
వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్-మాల్దీవుల మధ్య వివాదం రాజుకుంది.
మాల్దీవుల
మంత్రుల వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్ కాట్ మాల్దీవుల
ప్రచారం ఊపందుకుంది. సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు.
మాల్దీవుల
ట్రిప్ ను రద్దు చేసుకుంటున్న భారతీయులు దానికి బదులుగా లక్షద్వీప్ వెళ్ళడానికి
ప్రాధాన్యమిస్తున్నారు.
నష్ట
నివారణ చర్యలు చేపట్టిన మాల్దీవుల ప్రభుత్వం భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన
ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.