అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవ సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
మంగళవారం నాడు ఆలయానికి మొదటి బంగారు తలుపు ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తు, 8
అడుగుల వెడల్పు కలిగిన తలుపును గర్భగుడి పై అంతస్తులో అమర్చారు. మరో 13 తలుపులు
కూడా రెండూ మూడు రోజుల్లో బిగించనున్నారు. మొత్తం 46 తలుపుల్లో 42కి బంగారు పూత
పూయనున్నారు.
గర్భగుడిలో
బాలరాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత ప్రధాని మోదీ రామ్ లల్లాకు నామకరణం చేస్తారు. జనవరి 22నే ఈ పేరును వెల్లడించనున్నారు.
ఈ విషయమై ఇప్పటికే పండితులతో చర్చలు జరిగాయి. ప్రాణప్రతిష్ట సందర్భంగా బాలరాముడి
విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పూజా మండపం నుంచి గర్భగుడికి
తీసుకొస్తారు. 25 సెకన్లలోనే ఈ కార్యక్రమం జరగనుంది.
22 తేదీన ఉత్తరప్రదేశ్ లోని
అన్ని విద్యాసంస్థలకూ సెలవు ప్రకటించారు. మద్యం దుకాణాలు తెరవ వద్దని ఆదేశాలు జారీ
చేశారు.
జనవరి
22న దేశంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ్
జన్మభూమి తీర్థక్షేత్రట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు.
గుజరాత్ లోని భావ్నగర్ కు చెందిన జైలంగానియా అనే
ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనా చెక్కారు. 22 రోజుల వ్యవధిలో
24 గ్రాముల వెండిని ఉపయోగించి దీనిని తయారు చేశారు. ఇందులో హనుమాన్ విగ్రహంతో పాటు
రామదర్బార్ ఉన్నాయి.