YSRCP complains to CEC
against TDP chief
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ
పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai
Reddy), రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) విజయవాడలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను (Chief Election Commissioner) కలిసారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం
డేటాను టీడీపీ దుర్వినియోగపరుస్తోందని,
అక్రమాలకు పాల్పడుతోందనీ ఆరోపించారు. లక్షల్లో
దొంగ ఓట్లు అంటూ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తామే స్వయంగా పక్క రాష్ట్రాల దొంగ
ఓటర్లను చేర్పిస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 6 అంశాలపై సీఈసీ దృష్టికి
తీసుకెళ్ళామని విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పారు.
గుర్తింపులేని పార్టీ జనసేనకు సీఈసీని
కలిసే అవకాశం ఇవ్వకూడదని, టీడీపీతో పాటు వారు కూడా సీఈసీని కలిసిన సంగతిని వారి దృష్టికి
తీసుకువెళ్ళామన్నారు. జనసేన అధికారికంగా బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ తెలుగుదేశంతో అనధికారిక
పొత్తులో ఉన్న విషయాన్ని కూడా సీఈసీకి చెప్పామన్నారు. గుర్తింపు లేని ఆ పార్టీకి
కామన్ సింబల్ గాజుగ్లాసును (JSP
Symbol) కేటాయించడం చట్టవిరుద్ధమని వెల్లడించామని
విజయసాయిరెడ్డి చెప్పారు.
టీడీపీ కార్యకర్త కోనేరు సురేష్, రాష్ట్రంలో
పదిలక్షల పైచిలుకు బోగస్ ఓట్లున్నాయంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బల్క్ కంప్లైంట్
చేసాడు, వాటిపై విచారణ కోరాడు. జిల్లా కలెక్టర్ల పరిశీలనలో ఆఫిర్యాదులో
నిజం లేదని తేలింది. ఎన్నికల సంఘం విలువైన సమయాన్ని వృధా చేయడాన్ని చట్టవ్యతిరేక
చర్యగా పరిగణించి చర్యలు తీసుకోవాలని
కోరామని విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఓట్లను తొలగించేందుకు
ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. (Voters
list tampering)
‘మైపార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’తో టీడీపీ ఇల్లీగల్ ఓటర్
ప్రొఫైలింగ్ (Illegal voter
profiling) చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆ
డ్యాష్‌బోర్డ్‌లో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులంతో పాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నెంబర్
వంటి వివరాలున్నాయి. అలాంటి సమాచారాన్ని సేకరించడం అక్రమం అని ఫిర్యాదు చేసారు.
టీడీపీ అమలు చేయబోయే పథకాల ద్వారా ఐదేళ్ళలో
ఓటరుకు ఎంత ఆర్ధిక లబ్ధి పొందుతుంది అనే లెక్కలతో
కార్డులు పంచుతున్నారు. అది అక్రమం అని ఫిర్యాదు చేసినట్టు విజయసాయిరెడ్డి
చెప్పారు.
చంద్రబాబునాయుడు, లోకేష్ (Chandrababu Naidu and Lokesh) తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారిపై
ఐపీసీ, సీఆర్పీసీ ప్రకారం క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కోరామన్నారు. నారా
లోకేష్ ఎర్రబుక్కు చూపిస్తూ ప్రభుత్వ అధికారులను జైళ్లకు పంపుతామంటూ బెదిరిస్తున్నారనీ,
ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళామనీ చెప్పారు.
ఆంధ్రా, తెలంగాణ
రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజున నిర్వహించాలని వైసీపీ కేంద్ర ఎన్నికల
సంఘాన్ని కోరింది. ఓటర్ల జాబితా సవరణల్లో టీడీపీ చాలా దొంగ పనులు చేస్తోందనీ, తెలంగాణలో
ఉన్న ఓట్లను కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ చేస్తున్నారనీ
ఆరోపించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున.. అక్కడి టీడీపీ అనుకూల ఓటర్లకు
తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు కోసం
ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.