బీజేపీ
పాలనలోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగిందని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. అరకు మండలం గన్నెల పంచాయతీలో
పర్యటించిన పురందరేశ్వరి స్థానికులతో ముచ్చటించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా
పొందుతున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. పురందరేశ్వరి తమ ఇళ్ళకు రావడంపై
స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని,
గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ద్రౌపది
ముర్మను బీజేపీ రాష్ట్రపతిని చేసిందన్నారు.
గిన్నెల
పంచాయతీ పరిధిలో 122 మంది లబ్ధిదారులకు కేంద్రం ఇళ్ళు మంజూరు చేసినా వైసీపీ
ప్రభుత్వం నిర్మించలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం
మెరుగుపడటంలో ఎన్డీయే ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు.
పేదలకు మేలు జరగాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని
పిలుపునిచ్చారు.
ఫిబ్రవరిలో
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నందున వచ్చే పక్షం రోజుల్లో పార్టీ
బలోపేతానికి శ్రమించాలని పురందరేశ్వరి సూచించారు. ఓట్ల తొలగింపు, నకిలీ ఎపిక్
కార్డుల జారీ గురించి బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ దృష్టి సారించిందన్నారు. విశాఖ
ఉత్తర నియోజకవర్గం లో 61వేల ఓట్లు గల్లంతు అయ్యాయన్నారు.
పర్యటనలో
మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజారావు పాల్గొన్నారు.