TDP, JSP complain to CEC
against YSRCP
జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా పెరిగిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు ఓటర్ల
జాబితాలో నకిలీ ఓట్లు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారనీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (TDP chief N Chandrababu Naidu) మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు.
అందుకే ప్రజల్లో తిరుగుబాటు రేగిందన్నారు.
పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికల
సంసిద్ధతను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) అధికారులు విజయవాడ వచ్చారు.
టీడీపీ-జేఎస్పీ కూటమి (TDP JSP Alliance) నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా సీఈసీ,
ఆయన బృందాన్ని కలిసారు. చీఫ్ ఎలక్టోరల్ కమిషనర్ రాజీవ్ కుమార్కు రాష్ట్రంలోని స్థితిగతుల
గురించి ఫిర్యాదు చేసారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు
నాయుడు ‘‘ఓటర్ల జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసాం. ప్రతిపక్షాల నేతలు,
కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మా కూటమి పక్షాల నేతలు, కార్యకర్తలపై సుమారు
7వేల కేసులు పెట్టారు. ఎన్నికల విధులకు సచివాలయాల సిబ్బందిని, గ్రామ వాలంటీర్లను,
మహిళా పోలీసులనూ నియమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా, వైఎస్ఆర్సీపీ పాల్పడుతున్న
అరాచకాల గురించి సీఈసీకి వివరించాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు వీలుగా అన్నిచర్యలూ
తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు’’ అని చెప్పారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ
రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లు నమోదవుతున్నాయని, ఆ విషయంలో సీఈసీకి
ఫిర్యాదు చేసామనీ చెప్పారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే లక్షకు పైగా దొంగఓట్లు
నమోదయ్యాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తమ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలపై అక్రమ
కేసులు బనాయించారంటూ అధికార వైఎస్ఆర్సీపీ మీద ఫిర్యాదు చేసినట్లు పవన్ కళ్యాణ్
చెప్పారు.