అయోధ్యలో
రామమందిర నిర్మాణం కోసం భారతీయులంతా పరితపించారు. ఒక్కోక్కరూ ఒక్కో మార్గంలో శ్రీరాముడి
ఎడల తమ భక్తిభావాలు ప్రదర్శిస్తూ మందిర నిర్మాణం కోసం సంకల్పాలు తీసుకున్నారు.
ఝార్ఖండ్
రాష్ట్రంలోని ధన్బాద్కు చెందిన 85 ఏళ్ల భక్తురాలి సంకల్పం మిగతావారికంటే భిన్నమైంది.
వివాదాస్పద బాబ్రీ నిర్మాణం కూల్చివేత జరిగినప్పటి నుంచి ఆమె మౌనవ్రతం
పాటిస్తున్నారు. రామమందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాతే మాత్రమే మౌనం వీడుతానని
సంకల్పించారు.
సరస్వతీ
దేవి(85) శ్రీరాముడి భక్తురాలు, ఆమె బాబ్రీ నిర్మాణం కూల్చివేత తర్వాత అయోధ్యను
సందర్శించారు. అప్పటి నుంచి రామమందిరం నిర్మాణం పూర్తి అయ్యేవరకు మౌనవ్రతం
చెయ్యాలని సంకల్పించారు. అప్పటి నుంచి 2020 వరకు రోజుకు 23 గంటలు మౌనవ్రతం చేసేవారు.
2020లో రామమందిరానికి భూమిపూజ జరిగిన రోజు
నుంచి 24 గంటలపాటు మౌనవ్రతం పాటిస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి
ఆహ్వానం అందడంతో ప్రయాణమ్యారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె వ్రతానికి సమాప్తం
పలుకుతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్థానికులు ఆమెను మౌనీమాతగా పిలుస్తారు.
భవ్య రామందిరంలో
5,500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించనున్నారు. 44 అడుగుల పొడవు, 9.5
అంగుళాల వ్యాసంతో గుజరాత్ కు చెందిన కంపెనీ దీనిని తయారు చేసింది. పూర్తిగా
వెండితో తయారు చేసినట్లు వెల్లడించింది.