ED raids 7 locations linked to money laundering probe
శివసేన(ఉద్ధవ్
వర్గం)కు చెందిన మరో ప్రజాప్రతినిధి పై ఈడీ కేసు నమోదైంది. లగ్జరీ హోటల్ నిర్మాణంలో
భాగంగా అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో ఈడీ దాడులు చేస్తోంది. మహారాష్ట్రలో
ఏడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
శివసేన
ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యే రవీంద్ర వైఖర్, అతని వ్యాపార భాగస్వాముల నివాసాల్లో ఈడీ అధికారులు
తనిఖీలు చేపట్టి ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. ముంబైలోని జోగేశ్వరీంలో
లగ్జరీ హోటల్ నిర్మాణానికి సంబంధించి మనీ లాండరింగ్ చట్టం నిబంధనల ఉల్లంఘన
జరిగిందనే అభియోగాల ఆధారంగా ఎమ్మెల్యే రవీంద్రపై కేసు నమోదైంది.
ఈ
స్టార్ హోటల్ నిర్మాణం కోసం రూ. 500 కోట్లు వెచ్చించడంతో పాటు భూ వినియోగం
అనుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారని గత నవంబర్లో ఈడీకి ఫిర్యాదు అందడంతో కేసు
నమోదైంది.
బీఎంసీ
ప్లే గ్రౌండ్ కోసం రిజర్వు చేసిన స్థలంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి అనుమతి
పొందడం ద్వారా రూ.500 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు
వెల్లువెత్తాయి.
జోగేశ్వరీ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్ర వైఖర్, శివసేన(ఉద్ధవ్
వర్గం) నేత ఉద్ధవ్ థాకరేకు అత్యంత సన్నిహితుడు.