Muslim Journo support
to Lakshadweep tourism on religious grounds
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ జర్నలిస్టు
ఇరెనా అక్బర్ (Irena Akbar) లక్షద్వీప్ పర్యాటకానికి మద్దతు పలికింది. మాల్దీవ్స్ వివాదం తర్వాత
దేశంలోని ప్రముఖులంతా దేశీయ పర్యాటకానికి అండగా నిలుస్తున్నారు. కానీ ఇరెనా
మద్దతుకు కారణం వేరు. ఆమెకు మాల్దీవుల మీద కోపమేమీ లేదు. కానీ లక్షద్వీప్ మీద
ప్రేమ పొంగి పొర్లడానికి కారణం అక్కడ అంతా ముస్లిం జనాభాయే కాబట్టి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 2న లక్షద్వీప్‌ను
సందర్శించారు. పర్యాటకానికి స్వర్గధామం లాంటిదంటూ ఆ దీవులకు కితాబిచ్చారు.
మాల్దీవ్స్‌కు చెందిన మంత్రులు దానిపై స్పందించారు. భారతదేశాన్నీ, భారత ప్రధానినీ
కించపరిచేలా వ్యాఖ్యలు చేసారు. అది రాజకీయ రగడకు దారితీసింది. అదే సమయంలో
భారతదేశంలోని ప్రముఖులందరూ దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలంటూ సోషల్ మీడియాలో
వ్యాఖ్యలు చేస్తున్నారు. మనదేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు, మన దేశంలోని అందమైన
అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ పర్యటించడం మేలని సందేశాలు
ఇస్తున్నారు. సినీ క్రీడా రంగాల ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు లక్షద్వీప్‌ను
సందర్శిస్తామంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ జర్నలిస్టు (Indian Express former journalist) ఇరెనా అక్బర్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ మరో కొత్త వివాదానికి
దారితీసింది.
ఇరెనా అక్బర్ ఇలా ట్వీట్ చేసింది, ‘‘నేను మాల్దీవులను
బాయ్‌కాట్ చేయడాన్ని సమర్ధించడం లేదు. కానీ లక్షద్వీప్‌లో పర్యాటకానికి మాత్రం
కచ్చితంగా మద్దతిస్తాను. ఎందుకంటే లక్షద్వీప్ జనాభాలో 97శాతం మంది
ముస్లిములే. ఇతర దేశాల ముస్లిముల కంటె మన దేశంలోని ముస్లిములకు ఆర్థికంగా మేలు
చేకూరడానికే నేను ప్రాధాన్యం ఇస్తాను.’’ (Support to Lakshadweep on religious lines)
ఇరెనా అక్బర్ ‘ఎక్స్’లో చేసిన ట్వీట్
సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. కొంతమంది, దేశం పట్ల ఆమె
విధేయతను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు,
ఆమె ముస్లిం అయినందునే మతపరమైన కోణంలో లక్షద్వీప్‌కు
మద్దతివ్వడం సరికాదని మండిపడుతున్నారు. అలాంటి విమర్శల నేపథ్యంలో ఇరెనా తన ‘ఎక్స్’
అకౌంట్‌ను మూసేసుకుంది.
నిజానికి సోషల్ మీడియాలో ఇరెనా చేసిన
వ్యాఖ్యలు వివాదాస్పదం (Irena Akbar
care of controversies) అవడం ఇదేం
మొదటిసారి కాదు. గత అక్టోబర్‌లో హమాస్ ఉగ్రవాదులు ఒక జర్మన్ మహిళను ఇజ్రాయెల్
నుంచి ఎత్తుకెళ్ళిపోయి నిర్బంధించినప్పుడు ఇరెనా ఆ చర్యను సమర్థించింది. 2021లో కోవిడ్
వ్యాప్తికి ఆమె అల్లాకు ధన్యవాదాలు
చెప్పింది. కోవిడ్ రాకపోయి ఉంటే భారతీయ ముస్లిములను డిటెన్షన్ క్యాంపుల్లో
నిర్బంధించి, చంపేసేవారని ఇరెనా ఆరోపించింది. ముస్లిం వ్యతిరేక రాజ్యహింసలో చావడం
కంటె కోవిడ్ చేతిలో చావడం మేలంటూ భారత ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసింది.
2020 ఫిబ్రవరిలో ఇరెనా గుజరాతీ దళితులపై విరుచుకుపడింది. వాళ్ళని
ముస్లిములు నమ్మకూడదని వ్యాఖ్యానించింది. 2002 గుజరాత్ మతఘర్షణల్లో అక్కడి దళితులదే
ప్రధానపాత్ర అని ఆరోపించింది. ముస్లిం మహిళలను గ్యాంగ్‌రేప్‌లు చేసి చంపేసినవారు
దళితులే, వాళ్ళను నేను ఎప్పుడూ నమ్మను. దళితులను చిన్నచూపు చూసేది అగ్రవర్ణ
హిందువులే తప్ప ముస్లిములు కాదు, ఐనా దళితులు ముస్లిములపై అత్యాచారాలకు పాల్పడ్డారని వ్యాఖ్యలు
చేసింది.
హిందూ వ్యతిరేక
వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఇరెనా సిద్ధహస్తురాలు. హిందువుల దుకాణాల నుంచి
కొనుగోళ్ళు చేయవద్దందటూ ముస్లిములకు పిలుపునిచ్చిన చరిత్ర ఆమెది. అందుకే ఇప్పుడు
మాల్దీవులు-లక్షదీవుల విషయంలో సైతం వివాదాస్పదంగా మాట్లాడి తన నోటి దురుసును
ప్రదర్శించింది.