Former Diplomat’s book:
బాలాకోట్
వైమానిక దాడుల వేళ పాకిస్తాన్ అభ్యర్థనను చైనా తోసిపుచ్చినట్లు మాజీ దౌత్యవేత్త
అజయ్ బిసారియా తెలిపారు. బాలాకోట్ ఘటన తర్వాత దాయాదుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే
ప్రయత్నాల్లో భాగంగా మధ్యవర్తిత్వం వహించేందుకు పలు దేశాలు సంసిద్ధత తెలిపినట్లు
ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో మార్కెట్లో అందుబాటులోకి
రానుంది.
బాలాకోట్
ఘటన జరిగిన తర్వాతిరోజు 2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానికదళం ఎఫ్-16 విమానాలతో
భారత్ పై దాడికి యత్నించిన విషయాన్ని కూడా పుస్తకంలో అజయ్ ప్రస్తావించారు. పాకిస్తాన్
సైన్యానికి చిక్కిన కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు
భారత్ యుద్ధ విమానాన్ని పంపేందుకు సిద్ధమైందన్నారు. కానీ పాకిస్తాన్ నిరాకరించిందన్నారు.
ఉద్రిక్తతల వేళ తమ దేశంలోకి భారత యుద్ధ విమానం రావడం సరికాదని సర్ధి చెప్పినట్లు
వివరించారు.
బాలాకోట్
దాడి తర్వాత పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్ మినా జన్‌జువాకు ఆ దేశ సైనికాధికారుల
నుంచి కీలక సమాచారం అందిందన్న బిసారియా, ఆ సమాచారాన్ని ఆమె అమెరికా, యూకే,
ఫ్రాన్స్ రాయబారులకు చేరవేశారన్నారు.
పాకిస్తాన్
పైకి భారత్ తొమ్మిది క్షిపణులు ఎక్కుపెట్టిందని వాటిని ఏక్షణంలోనైనా ప్రయోగించే
అవకాశముందనేది ఆ సందేశ సారాంశమని పేర్కొన్నారు.
ఐరాసలో వీటో అధికారం కల్గిన ఐదు దేశాలతో పాటు , దాయాది
దేశాల మధ్య దౌత్య చర్చలు జరిగాయని పుస్తకంలో రాశారు.
ప్రధాని
మోదీతో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడేందుకు విఫలయత్నం చేశారన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో పాటు ఘర్షణ పూరిత
వాతావరణం నుంచి వెనక్కి తగ్గుతామని ఇమ్రాన్ చెప్పినట్లు విదేశీరాయబారులు మన దౌత్యాధికారులకు
వివరించారు. అభినందన్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పినట్లు బిసారియా తన పుస్తకంలో
వెల్లడించారు.
భారత్
తో వివాదం విషయంలో చైనా సాయాన్ని ఇమ్రాన్ ఖాన్ కోరారని , కానీ షీ జిన్ పింగ్
దానిని తిరస్కరించారని చెప్పారు. అమెరికాతో మాట్లాడి తేల్చుకోవాలని జిన్ పింగ్
సూచించారన్నారు.
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనిక కాన్వాయ్ పై
ఉగ్రవాదుల భీకర దాడి చేశారు. దీంతో బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలను భారతవాయు సేన
ధ్వంసం చేసింది.
ఫ్రిబ్రవరి
27న పాకిస్తాన్ ఎఫ్-16 విమానాలతో భారత్ పై
దాడికి యత్నించగా మన వింగ్ కమాండర్ అభినందన్
మిగ్21తో వెంటాడారు. పాకిస్తాన్ కు చెందిన
ఓ విమానాన్ని కూల్చారు. తర్వాత విమానం కూలిపోవడంతో అభినందన్ పాక్ ఆర్మీకి
చిక్కారు.
భారత్
తో పాటు విదేశాల నుంచి ఒత్తిడి రావడంతో అభినందన్ ను వాఘా సరిహద్దు వద్ద భారత్ కు
అప్పగించింది.