అగ్రరాజ్యం అమెరికాలో మరో అరాచకం వెలుగుచూసింది. ఓ ఉన్మాది అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ గేటును వాహనంతో ఢీ (america crime news) కొట్టాడు. సోమవారం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ ఉన్మాద చర్య జరిగినట్లు యునైటెడ్ సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఉన్మాదచర్యకు దిగిన వాహన డ్రైవర్‌ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు శ్వేతశౌధంలో లేరని ప్రకటించారు. వాహనంతో ఢీ కొట్టిన సమయంలో అక్కడ విపరీతమైన రద్దీ ఉంది. ట్రాఫిక్ సమస్య వల్ల జరిగిందా? వాహనం అదుపు తప్పిందా? ఉన్మాద చర్యకు పాల్పడ్డాడా అనేది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు.