పేగుబంధం మరిచింది. కన్న కుమారుడినే చంపేసి అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఘటన గోవాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. బెంగళూరుకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త, నాలుగేళ్ల చిన్నారితో గోవాలోని ఓ హోటల్ గదిలో దిగింది. అక్కడ పనులు ముగించుకుని గదిని ఖాళీ చేసి బెంగళూరు బయలుదేరి వెళ్లింది. గదిని శుభ్రం చేస్తోన్న సిబ్బందికి, రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీసీ పుటేజీ ఆధారంగా చిన్నారితో హోటళ్లో దిగిన మహిళ, వెళ్లేప్పుడు ఒంటరిగా వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.
హోటల్ సిబ్బందికి మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెకు ఫోన్ చేసి పోలీసులు కుమారుడి గురించి అడిగారు. తన స్నేహితుడి ఇంట్లో వదిలిపెట్టానని ఆమె ఓ చిరునామా చెప్పింది. అది తప్పుడు చిరునామాగా తేలడంతో గోవా పోలీసులు, కర్నాటక పోలీసులకు సమాచారం అందించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు చిన్నారిని చంపిన మహిళా సీఈవోను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్యకు (goa crime news) కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.