దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ (stock markets) ప్రారంభించాయి. అంతర్జాయంగా అందుతోన్న సానుకూల సంకేతాలతో ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 465 పాయింట్ల లాభంతో 71821 వద్ద, నిఫ్టీ 145 పాయింట్ల లాభంతో, 21658 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.05గా ఉంది.
సెన్సెక్స్ 30లో అన్ని షేర్లు లాభాలార్జిస్తున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, హెచ్సీఎల్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్,
అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా లాభపడ్డాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను ఆర్జించాయి. ఐరోపా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో దేశీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి.