BJYM leader starts fast
unto death demanding Job Calendar
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రతీయేటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినా
ఏనాడూ అమలు చేయలేదని (Promise of Job Calendar) బీజేవైఎం అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ (AP BJYM President M Vamsikrishna) మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారని
ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఆమరణ నిరాహార దీక్ష (Fast unto death) చేపట్టారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary Y
Satya Kumar), వంశీకృష్ణ
నిరాహారదీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రతీ జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ విడుదల
చేస్తానని హామీ ఇచ్చిన సీఎం ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయడంలో
విఫలమయ్యారని సత్యకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 145 మంది
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. నిరుద్యోగం జాతీయ సగటు 3% ఉంటే
ఆంధ్రప్రదేశ్‌లో ఆ సగటు 4% కంటే ఎక్కువగా ఉందని సత్యకుమార్ వివరించారు. ఉపాధి
అవకాశాల కోసం యువత పెద్దఎత్తున ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన చెందారు. సీఎం
జగన్ హామీ ఇచ్చిన 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం,
పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున
పాల్గొన్నారు.