ప్రధాని నరేంద్ర మోదీ, భారత్‌పై మాల్దీవుల మంత్రులు(ex cricketer sehwag promotes udipi beach) చేసిన వ్యాఖ్యలను ప్రముఖ క్రికెటర్ సెహ్వాగ్ తిప్పికొట్టారు. చవకబారు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని వారికి హితవు పలికారు. భారత్‌లో అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయని ఆయన అన్నారు. ఉడిపి బీచ్, పాండిలోని ప్యారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హేవ్‌లాక్ బీచ్ ప్రాంతాలు చాలా సుందరంగా ఉంటాయన్నారు. కొద్దిపాటి సదుపాయాలు మెరుగుపరిస్తే పర్యాటకులను ఆకట్టుకుంటాయన్నారు.
మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు తగిన బుద్ది చెప్పేలా దేశంలోని అందమైన బీచ్‌లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని సెహ్వాగ్ కోరారు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాను. మన దేశంలోని హోటల్స్ అందించే సేవలు అద్భుతంగా ఉంటాయని మరో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశారు.
భారతీయులను బాధపెట్టేలా మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను క్రికెటర్ సురేశ్ రైనా ఖండించారు. దేశ ఆత్మగౌరవం ముఖ్యమని, పర్యాటక రంగానికి మద్దతు తెలపాలని కోరారు.దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకరంగం ఎంతో కీలకమని ఆయన గుర్తుచేశారు.