Lakshadweep in top
trending in Google searchnow
లక్షద్వీప్… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
ప్రఖ్యాతి గడించిన పేరు. గూగుల్ సెర్చ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న పేరు. లక్షద్వీప్
గురించి గూగుల్ సెర్చ్‌లో అన్వేషిస్తున్న వారి సంఖ్యత గత 20 ఏళ్ళలోకెల్లా అత్యధిక
స్థాయికి చేరుకుంది. దానికి కారణం ఒక్కటే. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అక్కడ
పర్యటించడమే.
లక్షద్వీప్ గురించి ఇప్పుడు
అంతర్జాతీయంగా ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. జనవరి 2న భారత ప్రధాని నరేంద్ర
మోదీ అక్కడ ఒక రాత్రి నివసించారు. అక్కడి బీచ్‌లలో విహరించారు. అక్కడి సముద్రతీరంలో
స్నోర్కెలింగ్ వంటి సాహస క్రీడల్లో స్వయంగా పాల్గొన్నారు. పర్యాటకులకు లక్షద్వీప్
స్వర్గధామం లాంటిదని ఆయన తన చర్యలతో ప్రకటించారు.
అదే సమయంలో మాల్దీవ్స్‌కు
చెందిన మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సైతం తోడవడంతో, లక్షద్వీప్‌పై అంతర్జాతీయ
పర్యాటకుల్లో సైతం ఆసక్తి కలిగింది. ఆ దేశానికి చెందిన కొందరు మంత్రులు,
ప్రభుత్వాధికారులూ భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన గురించి
నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో లక్షద్వీప్ గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది.