దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానోపై (bilkis balo rape case) సామూహిక అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో దోషులు 11 మందిని జైలు నుంచి గుజరాత్ ప్రభుత్వం ముందుగానే విడుదల చేయడాన్ని బాధితురాలి కుటుంబసభ్యులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఖైదీల శిక్ష తగ్గించి ముందుగా విడుదల చేసే రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది. కాబట్టి శిక్ష తగ్గించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
2002లో గుజరాత్లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్ల సమయంలోనే బిల్కిస్‌పై అత్యాచారం జరిగింది. బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ చేయడంతోపాటు, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు చంపేశారు. అత్యాచారం సమయంలో బిల్కిన్ ఐదునెలల గర్బవతిగా ఉందని, ఈ కేసులో 11 మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు 2008లో జీవిత ఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా శిక్షను సమర్థించింది. దోషులు 15 సంవత్సరాలు జైల్లో గడిపారు. దోషుల అభ్యర్థన మేరకు గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేయడంతో వారు 2022 ఆగష్టు 15న విడుదలయ్యారు.