ప్రభుత్వరంగం సంస్థ ఓఎన్జీసీ ప్రతిష్ఠాత్మకంగా మొదలు పెట్టిన కేజీ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. రూ.40 వేల కోట్ల వ్యయంతో కేజీ బేసిన్లో గ్యాస్, చమురు వెలికితీసేందుకు చేపట్టిన ప్రాజెక్టులో మొదటి దశను ఓఎన్జీసీ (ongc bigins oil gas production in kg basin) ప్రారంభించింది. ఏపీ తీర ప్రాంతానికి 35 కి.మీ సముద్రంలో ఓఎన్జీసీ చేపట్టిన తవ్వకాలు పూర్తి అయ్యాయి. అక్కడ ఉత్పత్తి ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి హర్థీప్ సింగ్ మీడియాకు వెల్లడించారు. అయితే రోజుకు ఎంత చమురు, గ్యాస్ ఉత్పత్తి అవుతోందనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.
కేజీ బేసిన్లో ఓఎన్జీజీసీ రోజుకు 45 వేల బ్యారెళ్ల చమురు, కోటి మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వెలికి తీస్తోందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి
అధికారిక ప్రకటన వెలువడలేదు. దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తిలో 7 శాతం అదనంగా జమవుతోందని మాత్రం వెల్లడించారు. కేజీ బేసిన్లో ఓఎన్జీసీ ఉత్పత్తి ప్రారంభించడం దేశ ఇంధన రంగంలో గొప్ప ముందడుగని ప్రధాని మోదీ కొనియాడారు.