ED summons
former Kerala minister
కేరళ
సీపీఎం సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్కు ఈడీ సమన్లు జారీ
చేసింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో భాగంగా ఆయన శాఖ పరిధిలోని కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,
ఇన్వెస్టెమెంట్ ఫండ్ బోర్డు(KIIFB)
నుంచి జారీ చేసిన మసాల బాండ్ల జారీ ప్రకియపై విచారణలో భాగంగా ఈ తాఖీదులను ఈడీ జారీ
చేసింది.
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా బాండ్లు జారీ
చేశారనే ఆరోపణలపై ఇస్సాక్ ను ఈడీ ప్రశ్నించనుంది.
జనవరి
12న విచారణకు హాజరుకావాలని నోటీసులో విచారణ సంస్థ పేర్కొంది.
గతంలో
జారీ చేసిన తాఖీదులు వెనక్కి తీసుకుంటున్నట్లు కేరళ హైకోర్టుకు తెలిపిన ఈడీ, తాజా
మళ్ళీ నోటీసులు జారీ చేసింది.
కేరళ
హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తులో భాగంగానే నోటీసులు జారీ
చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.
KIIFB ద్వారా
రూ. 2 వేల కోట్ల నిధులు సేకరించిన ప్రక్రియపై ఫెమా నిబంధనలను అనుసరించి దర్యాప్తు
చేస్తున్నట్లు వివరించారు.
కేరళ రాష్ట్రంలోని క్లిష్టమైన, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు
పెట్టుబడిని అందించడమే KIIFB ప్రధాన ఉద్దేశం. కానీ 2016లో, కేరళ ప్రభుత్వం KIIFB పాత్రను బడ్జెట్ కు మించి వనరుల సేకరణ
సంస్థగా మార్చింది.