లక్ష్యదీప్లో
ప్రధాని మోదీ పర్యటనను ఉద్దేశించి మాల్దీవుల మంత్రి మరియం షియూనా సోషల్ మీడియా
వేదికగా చేసిన వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఖండించారు. ఇష్టానుసారం
అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితువు పలికారు. మరియం ఉపయోగించిన భాష అత్యంత
కర్కశంగా ఉందని వ్యాఖ్యానించారు. మాల్దీవుల మంచికోరే దేశాల్లో భారత్ ఒకటని
అన్నారు.
అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా
ఉండాలని ప్రభుత్వ విధానాల్లో విద్వేషం ఉండకూడదని సూచించారు. మంత్రి చేసిన
వ్యాఖ్యలపై భారత్ కు వివరణ ఇవ్వాలని అధ్యక్షుడిని కోరారు.
2008
లో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన నషీద్ 2014లో పదవికి రాజీనామా చేశారు.
మాల్దీవుల
అధ్యక్షుడి మహ్మద్ మయిజ్జూ ఎన్నికైనప్పటి నుంచి భారత్ తో ఆ దేశ సంబంధాలు
దిగజారాయి. అతను అధికారంలోకి వచ్చిన వెంటనే భారత సైనికులు తమ దేశం విడిచిపోవాలని
పిలుపునిచ్చారు. చైనా అనుకూల వైఖరి తో పరిపాలనలో ముందుకెళుతున్నారు.
మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా మోదీ
లక్షద్వీప్ పర్యటన గురించి నోరుజారాడు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో లక్షద్వీప్ పోటీ
పడలేదనే అర్థం వచ్చేలా ప్రకటన చేశారు. పరిశుభ్రత విషయంలో తమతో పోటీ పడటం భ్రమే
అంటూ వెక్కిరించారు. ఈ వ్యాఖ్యలను పలువురు తూర్పార బడుతున్నారు. స్వదేశంతోపాటు
భారత్ సహా ఇతర దేశాలు వారు వ్యాఖ్యలను తప్పుబట్టారు.
దేశీయంగా
పర్యాటకరంగా పోత్సహించే ఉద్దేశంతో ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించి సముద్రం
ఒడ్డున సేదతీరారు. సముద్ర జలాల్లో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనే వారు తమ
జాబితాల్లో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని కోరుతూ పర్యటనకు సంబంధించిన ఫొటోలను
సోషల్ మీడియాలో షేర్ చేశారు.