పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తిరుమలలో ( tirumala) ఏకంగా వైసీపీ, సీఎం స్టిక్కర్లు వేసిన కార్లతో హల్చల్ చేశారు. తిరుమలలో ఎలాంటి పార్టీలు, అన్యమతాల ప్రచారానికి అనుమతించరు. అయితే వైసీపీ నేతల ఆగడాలను మాత్రం టీటీడీ సిబ్బంది అడ్డుకోలేదు. శనివారం శ్రీబ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాలస్వామి మఠం ఎదుట ఏపీ02ఏపీ 3699 అనే కారును నిలిపారు. వెనక భాగంలో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు వేశారు.
అలిపిరి వద్దే ఇలాంటి అరాచకాలను అడ్డుకోవాల్సిన భద్రతా సిబ్బంది వదిలేయడంతో తిరుమలకు చేరుకున్నారు. పార్టీల కండువాలు, స్టిక్కర్లు, అన్యమతాల చిహ్నాలను అలిపిరి వద్దే భద్రతా సిబ్బంది పరిశీలించి వాహనాలను తిరుమలకు అనుమతించాలి. కాని ఇవేవీ చేయకుండానే వైసీపీ నేతల కారును అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.