Wins Lottery
Worth ₹ 7,000 Crore…!
అమెరికాలో
ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. కొత్త ఏడాది
రోజున భారీ లాటరీ దక్కింది. కళ్లుబైర్లు కమ్మే మొత్తాన్ని దక్కించుకుని రికార్డు
సృష్టించారు. దాదాపు రూ.7 వేల కోట్ల( 842.4 మిలియన్ డాలర్ల )నగదు గెలుచుకున్నాడు. అయితే
డబ్బును జమ చేసుకునేందుకు అతనింకా లాటరీ సంస్థను
సంప్రదించలేదు.
మిచిగన్
లాటరీ అధికార ప్రతినిధి జాక్ హారీస్ మాట్లాడుతూ ఇంతపెద్ద మొత్తాన్ని గెలవడం
అసాధారణమేమీ కాదన్నారు. ఇలాంటి ఘటనల్లో నగదు జమ చేసుకోవడానికి విజేతలు కొంత సమయం
తీసుకుంటారన్నారు. కొన్ని సార్లు లాటరీ సంస్థే వారిని అప్రమత్తం చేస్తుందన్నారు. లాటరీ
ప్రైజ్ చెల్లించేందుకు ఏడాది గడువు ఉంటుందని తెలిపిన నిర్వాహకులు మిచ్గన్ లోని గ్రాండ్
బ్లాంక్ లోని ఫ్లింట్ కాజిల్ లో టికెట్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు.
ప్రైజ్మనీ మొత్తాన్ని 30 వాయిదాల్లో విజేతకు చెల్లించనున్నారు.
నగదు రూపంలో కావాలంటే మాత్రం పన్నులు మినహాయించి మిగతాది చెల్లిస్తారు. సుమారు 24
శాతం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
1992
నుంచి ఈ లాటరీ సంస్థ నిర్వహిస్తోండగా, అమెరికాలో ఇంతపెద్ద మొత్తంలో నగదుగెలుచుకోవడం
పదోసారి. మిచ్ గాన్ వాసిని లాటరీ వరించడం రెండోసారి అని గణంకాలు చెబుతున్నాయి.