రాజస్థాన్లోని అజ్మేర్లో
ఉన్న ఓ బ్యాంకు ముందు పుణ్యం కోసం భక్తులు క్యూ కడతారు. అదేంటి బ్యాంకుకు ఆర్థిక
లావాదేవీలకు బదులు పుణ్యం కోసం వస్తారా అనే సందేహం వస్తుందా. అవును వస్తారు…
ఎందుకుంటే అది వాణిజ్య బ్యాంకు కాదు. ముక్తిని, పుణ్యాన్ని ప్రసాదించే ఆద్మాత్మిక
బ్యాంక్ కాబట్టి.
అజ్మేర్లో
శ్రీరామ నామ బ్యాంకును, 1987
ఏప్రిల్ 7న ప్రారంభించారు.
అప్పటి నుంచి అక్కడ రామనామాల డిపాజిట్ల
సేకరణ జరుగుతోంది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 280 శాఖలు ఉండగా, దేశవిదేశాల్లోనూ
ఖాతాదారులు ఉన్నారు.
బ్యాంకు లో ఖాతా తెరిచిన వెంటనే ఓ పాస్ బుక్
అందజేస్తారు. ఆ తర్వాత ఖాతాదారుడికి 84
లక్షల రామనామాలు రాసే పుస్తకాన్ని పోస్టు చేస్తారు. వారు తిరిగి అందజేసిన తర్వాత
దానిని పరిశీలించి బ్యాంకు లో భద్రపరుస్తారు. ఒక్కో పుస్తకంలో 25 వేల నామాల లెక్కన
84 లక్షల రామనామాలు రాసేందుకు 336 పుస్తకాలు అవసరం అవుతాయి.
మొత్తం
55 వేల మంది ఖాతాదారులు ఉండగా, ఇప్పటి వరకు 2 వేల మంది 84 లక్షల మంది రామనామాలు
రాశారు.
జనవరి 14 నుంచి 22 వరకు అజ్మేర్
లోని అజాద్ పార్క్ లో రామనామ పుస్తకాలు ప్రదర్శనకు ఉంచనున్నట్లు నిర్వాహకలు
తెలిపారు.