ఉత్తర
గాజా ప్రాంతంలోని హమాస్ కమాండ్ వ్యవస్థను తుడిచిపెట్టినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ
వెల్లడించింది. దీంతో కొంతమంది పాలస్తినీయులు
అప్పుడప్పుడు చెదురుమదురు ఘటనలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి
డేనియల్ హగారీ తెలిపారు.
కమాండర్ లేకుండానే కొంతమంది మాత్రమే దాడులు చేస్తున్నారని
చెప్పారు.
మధ్య గాజా, దక్షిణ గాజా ప్రాంతాలపై హమాస్ దళాల
వ్యవస్థను ధ్వంసం చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. దీనికి కొంత సమయం
పడుతుందన్నారు.
సెంట్రల్
గాజా ఉగ్రవాదులతో కిక్కిరిస్తోందని, మధ్య గాజాప్రాంతంలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో
భూగర్భ నగరాలే ఉగ్రవాదులు నిర్మించారని చెప్పారు. కూకటివేళ్లతో ఉగ్రవాదాన్ని
ధ్వంసం చేసేవరకు విశ్రమించేదిలేదన్నారు. అందుకు దగ్గర దారి అంటూ ఏమీ ఉండదన్నారు.
హమాస్
మిలటరీ వింగ్ కమాండ్ మహమ్మద్ డెయిప్ ఫొటోను విడుదల చేసిన హగారీ, ఇజ్రాయెల్ మోస్ట్
వాంటెడ్ లిస్టులో అతను ఉన్నట్లు పేర్కొన్నారు.
హమాస్‌ను
పూర్తిగా తుడిచిపెట్టాలని మరోమారు ఆర్మీకి సూచించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్
నెతన్యాహూ, బంధీలను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు. మరోమారు ఇజ్రాయెల్ కు గాజా ముప్పుగా మారకుండా
చర్యలు తీసుకోవాలని చెప్పారు. లక్ష్యాన్ని చేరే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని
స్పష్టం చేశారు.
గత
ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దళాలు దాడికి తెగబడ్డాయి. దీంతో గాజాపై
ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రతిదాడులు చేస్తోంది. యుద్ధం కారణంగా 1,200 మంది
ఇజ్రాయెల్ పౌరులు మరణించగా, 22 వేల మంది పాలస్తీనియులు ప్రాణాలొదిలారు.